హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేళ భద్రతపై ఎస్పీ హెచ్చరిక

KMR: దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు ఇంటి భద్రతపై అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం సూచించారు. నగలు, నగదును భద్రపరచుకోవాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.