హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకం కలిగించాలి: SP

ADB: బాధితుల పట్ల గౌరవంగా మెలిగి పోలీసు వ్యవస్థ పై నమ్మకం కలిగించేలా సిబ్బంది పనిచేయాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరాలు జరగకుండా పటిష్టమైన గస్తీ, బీట్ వ్యవస్థను నిర్వహించాలని, మండలంలో గంజాయి, మాదకద్రవ్యాల నివారణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని SP అఖిల్ మహాజన్ ఆదేశించారు.