హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంపీ అవినాష్ రెడ్డికి ఎస్పీ వార్నింగ్

AP: కడప జిల్లా పులివెందులలో నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరిక జారీ చేశారు. నామినేషన్ల గడువు ముగిసినందున అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. లేదంటే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో అవినాష్ రెడ్డి పార్టీ శ్రేణులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుతూ, తాను కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు.