ఛత్తీస్గఢ్లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. అంబికాపూర్ నగరానికి ఉత్తర-వాయువ్యంగా దాదాపు 140 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది. భూకుదుపుల కారణంగా సమీప గ్రామాల్లోని ఇళ్ల వస్తువులు స్వల్పంగా కదిలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని సమాచారం.
వార్తలు
ఛత్తీస్గఢ్లో స్వల్ప భూకంపం


