హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో పసిబిడ్డల సమగ్ర పోషకాహార భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 6 నెలల లోపు చిన్నారుల కోసం తయారు చేసే ఆహార ఉత్పత్తుల్లో సుక్రోజ్, ఫ్రక్టోజ్ కలపడాన్ని పూర్తిగా నిషేదించాలని FSSAI ఆదేశించింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్-2020 నిబంధనలను సవరించింది. చిన్న వయస్సులో చక్కెర వల్ల ఊబకాయం, జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.