హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ సిబ్బందికి కొత్త దుస్తులు

SRCL: బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ ముడావత్ సరోజ చంద్రు నాయక్, ఉపసర్పంచ్ జెట్టి కిషన్ కొత్త దుస్తులు పంపిణీ చేశారు. పారిశుధ్య పనులకు అవసరమైన శానిటేషన్ సామగ్రిని కూడా అందజేశారు. పండుగ వేళ తమను గుర్తించడంపై సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. కార్యదర్శి మహేందర్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.