హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సభ్యుల వాకౌట్

NRPT: మరికల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశం నుంచి తొమ్మిది మంది వార్డు సభ్యులు వాకౌట్ చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండానే తీర్మానాలు చేస్తున్నారని BRS, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన సభ్యులు ఆరోపించారు. గోశాల, పంచాయతీ దుకాణాల అద్దె డబ్బుల వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు.