హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేములవాడలో ప్రమాదకరంగా మ్యాన్‌హోల్

SRCL: వేములవాడలో రెండో బైపాస్ నుంచి ఉప్పుగడ్డకు వెళ్లే మలుపు వద్ద మ్యాన్ హోల్ ప్రమాదకరంగా మారింది. డ్రైనేజీపై ఉన్న మ్యాన్ హోల్ మూత పగిలి లోపల పడిపోవడంతో అటుగా వెళ్లే ప్రజలు, వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మ్యాన్ హోల్‌కు కొత్త మూత ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.