హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివిధ శాఖల పనితీరుపై సమీక్ష

SDPT: బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌లో పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శైలజారెడ్డి శనివారం పర్యటించి గ్రామాభివృద్ధి పనులను పరిశీలించారు. పంచాయతీ కార్యాలయంలో వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించి, పనుల్లో పారదర్శకత పాటించాలని సూచించారు. ఉపాధి పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు.