హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారి ఉత్సవాలకు భారీ విరాళం

RR: నందిగామలో నిర్వహిస్తున్న భవానీమాత ఉత్సవాలకు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొమ్ము కృష్ణ రూ.1,51,000 విరాళం అందించారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించడం సంతోషంగా ఉందని తెలిపారు. భక్తి కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.