హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులు అప్రమత్తంగా ఉండాలి: AO

BDK: పినపాక మండలంలో శనివారం ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.