MLG: ములుగు మున్సిపాలిటీ పరిధి జీవంతరావుపల్లిలో శరన్నవరాత్రి వేడుకలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని శనివారం రూ.6.5 లక్షల కరెన్సీతో లక్ష్మీదేవి అవతారంలో అలంకరించారు. విశేష రూపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
తెలంగాణ
అమ్మవారికి ప్రత్యేక అలంకరణ


