హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆపదలో అండగా నిలిచిన సర్పంచ్

NGKL: తాడూరు మండలం శిరసవాడ గ్రామానికి చెందిన జల్లి చిన్న బాలయ్య అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ వాస శ్రీదేవి వేణుగోపాల్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన సర్పంచ్‌ను గ్రామస్తులు అభినందించారు.