మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్ అన్నారు. 16వ వార్డు మున్నేరు వాగు వద్ద రూ.4 కోట్లతో నిర్మించనున్న బతుకమ్మ ఘాట్కు శంకుస్థాపన చేశారు. తాగునీటి కోసం రూ.20 కోట్లు, సీసీ రోడ్లు, డ్రైన్ల కోసం రూ.69 కోట్లు, విద్యారంగ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించి మానుకోటను బంగారు కోటగా మారుస్తానన్నారు.
తెలంగాణ
'మానుకోటను బంగారు కోటగా తీర్చిదిద్దడమే లక్ష్యం'


