హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎడమ కాలువలో బాలిక మృతదేహం లభ్యం

సూర్యాపేట: జిల్లా చిలుకూరు మండలం ఆచార్యులగూడెం సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువలో సుమారు 10 నుంచి 15 ఏళ్ల వయస్సు ఉన్న బాలిక మృతదేహం లభ్యం అయినట్లు స్థానికులు తెలిపారు. బాలిక ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులకు తెలపడంతో ఘటన స్థలానికి చెరుకుని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలియజేశారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.