హైదరాబాద్: 28°C
తెలంగాణ

విదేశీ రోగుల కోసం టిమ్స్‌లో ప్రత్యేక వార్డులు

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌ ఆసుపత్రిలో విదేశీ రోగుల కోసం ప్రత్యేక వార్డులు అందుబాటులోకి వచ్చాయి. తొలి విడతలో 582 పడకలతో వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రైవేటు ఆసుపత్రులతో పోలిస్తే తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ సదుపాయాలను కల్పించారు.