MHBD: గార్ల మండలం పినిరెడ్డిగూడెంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయ నిర్మాణానికి ఇల్లందు MLA కోరం కనకయ్య, సర్పంచ్ కె. వీరన్నతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామపంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
పంచాయతీ భవనానికి శంకుస్థాపన...!


