గ్రేటర్ నోయిడాలో(UP) అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతులను మహేష్(37), భార్య లలిత(35), పిల్లలు లడ్డూ(11), మిష్టి(7), సాక్షాత్(3)గా గుర్తించారు. వారు చివరగా నూడుల్స్ తిని, టీ తాగడంతో ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్, ఫుడ్ సేఫ్టీ బృందాలు దర్యాప్తు చేపట్టగా, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
వార్తలు
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి


