TG: రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కేంద్రం ముందడుగు వేసింది. రాష్ట్రంలోని 5 ప్రముఖ ప్రాంతాల్లో రోప్వేల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. యాదగిరిగుట్ట, నాగార్జునకొండ, పెద్దపల్లి జిల్లాలోని రామగిరి కోట, నల్లగొండలోని హనుమాన్ హిల్, డిచ్పల్లిలోని ఖిల్లా రామాలయం ఈ జాబితాలో ఉన్నాయి. పర్వతమాల పథకం కింద రూ.1,230 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు.
వార్తలు
తెలంగాణలో ఐదు చోట్ల రోప్వేలు!


