హైదరాబాద్: 28°C
తెలంగాణ

టిఫిన్ చేస్తుండగా వ్యక్తి మృతి

మెదక్ జిల్లా రామాయంపేట మండలం కేంద్రంలోని సిద్దిపేట చౌరస్తా వద్ద శుక్రవారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక టిఫిన్ సెంటర్‌కు వచ్చి అల్పాహారం తింటున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.