హైదరాబాద్: 28°C
వార్తలు

అద్వానీని పరామర్శించిన జేపీ నడ్డా

అనారోగ్యంతో న్యూఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పరామర్శించారు. ఆస్పత్రిలో అద్వానీని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఛాతీ ఇన్ఫెక్షన్‌తో నిన్న రాత్రి ఆస్పత్రిలో చేరిన అద్వానీకి అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు.