హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగునీరు విడుదల చేయాలని రహదారిపై నిరసన

KNR: తెలంగాణలో సాగునీరు విడుదల చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై శంకరపట్నం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మైపాల్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. మండలంలో దాదాపు 3వేల ఎకరాలలో రైతులు పంట సాగు చేశారని అన్నిటికి పొట్ట దశలో పంట ఎండిపోతుందన్నారు.దిగువకు నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.