హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇథనాల్ కంపెనీ శబ్దంతో గ్రామస్థుల ఇబ్బందులు

NRPT: కృష్ణ మండలం హిందూపూర్ శివారులోని ఇథనాల్ కంపెనీ నుంచి వెలువడుతున్న భారీ శబ్దాలతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. బాయిలర్ స్టీమ్ విడుదల సమయంలో పెద్ద శబ్దం వస్తోందని, రాత్రివేళల్లోనూ ఇదే పరిస్థితి ఉందని వాపోతున్నారు. పిల్లలు, వృద్ధులు, విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.