హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరాటేలో కిషోర్ సత్తా బ్లాక్ బెల్ట్ కైవసం

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడకు చెందిన క్రీడాకారుడు గజ్వేల్ కిషోర్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి ప్రతిభ చాటారు. హైదరాబాద్‌లో ఓకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన గ్రేడింగ్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. గ్రాండ్ మాస్టర్ శ్రీనివాస్ చేతుల మీదుగా బ్లాక్ బెల్ట్ అందుకున్నారు. కిషోర్ విజయంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ.. అభినందనలు తెలియజేశారు.