కుప్వారా జిల్లా(J&K) కేరన్ సెక్టార్లో ఇవాళ ఉదయం ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. నియంత్రణ రేఖ(LoC) వెంబడి జుమ్గుండ్ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను గుర్తించిన జవాన్లు వారిని అడ్డుకున్నారు. దీంతో చొరబాటుదారులు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ముష్కరుల కోసం ఆ ప్రాంతంలో బలగాలు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
వార్తలు
ఉగ్ర కుట్రను తిప్పికొట్టిన భారత సైన్యం


