సూర్యాపేట: 1వ వార్డులో శనివారం కౌన్సిలర్ బాణోతు సైదులు నాయక్ మున్సిపల్ కార్మికులకు పట్టువస్త్రాలు అందజేశారు. దసరా పండుగ ప్రతి ఇంటా సిరిసంపదలు, సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ, దసరా పండుగలు ప్రతీకలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుర్రం ప్రకాశ్ రెడ్డి, బూర సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మున్సిపల్ కార్మికులకు పట్టువస్త్రాలు అందజేత


