హైదరాబాద్: 28°C
తెలంగాణ

కన్నులపండువగా రాముల వారి నిత్య కళ్యాణం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నిత్యకల్యాణ వేడుక శనివారం అత్యంత వైభవంగా జరిగింది. నిత్య కళ్యాణం మండపంలో వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ రామయ్య దివ్య వివాహ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.