హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్‌లో జోరందుకున్న పూల కొనుగోళ్లు

MNCL: మందమర్రి పట్టణం మార్కెట్ ఏరియాలో సద్దుల బతుకమ్మకు ఒకరోజు ముందు శనివారం పూల కొనుగోళ్లు జోరందుకున్నాయి. మహిళలు బంతి, గునుగు, సీతమ్మ జడ, తంగేడు పూలను కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. ఈ ఏడాది తంగేడు పూల కొరత ఏర్పడటంతో చాలామంది బంతిపూలను ఎక్కువగా కొనుగోలు చేశారు. మార్కెట్ ప్రాంతమంతా మహిళల సందడితో పండుగ వాతావరణం నెలకొంది.