హైదరాబాద్: 28°C
వార్తలు

ఐరాసలో భారత్ స్ట్రాంగ్ కౌంటర్

మానసిక ఆరోగ్యం, లింగ సమానత్వంపై పోరాడుతున్న భారత యువత వివక్ష ఎదుర్కొంటున్నారన్న ఐరాస ప్రతినిధి గినా రొమెరో నివేదికను భారత్ తోసిపుచ్చింది. గుర్తుతెలియని వ్యక్తుల ఆధారాలు లేని ఆరోపణలతో కూడిన గాలివార్తలను నివేదికగా మార్చారని భారత దౌత్యవేత్త అనుజ్ స్వరూప్ మండిపడ్డారు. ఇలాంటి నిరాధార నివేదికల వల్లే ఐరాస విశ్వసనీయత కోల్పోతోందంటూ 81వ UNGA సమావేశంలో స్వరూప్ ఘాటుగా బదులిచ్చారు.