హైదరాబాద్: 28°C
తెలంగాణ

తంగేడు పూల కొరత.. బంతికి పెరిగిన ధరలు

భూపాలపల్లి జిల్లాలో బతుకమ్మ పండుగ వేళ తంగేడు పూల కొరత కనిపిస్తుండటంతో బంతిపూలకు డిమాండ్ పెరిగింది. దీంతో బంతిపూల ధరలు పెరగడంతో బతుకమ్మలు పేర్చేందుకు పూలు కొనుగోలు చేసే మహిళలకు అదనపు భారం పడుతోంది. పండుగ సమీపిస్తుండటంతో మార్కెట్లలో పూల కొనుగోళ్లు పెరిగి, ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు.