మెదక్ రైల్వే లైన్ల డబ్లింగ్ పనుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా కాచిగూడ–మెదక్ (57301), అలాగే మెదక్–కాచిగూడ (57302) రైళ్లను నవంబర్ 16 నుంచి 22 వరకు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు ముందుగానే వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
తెలంగాణ
మెదక్ - కాచిగూడ రైళ్లు రద్దు అధికారుల వెల్లడి


