హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోచారం ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు

KMR: నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు నుంచి శనివారం కూడా నీటి విడుదల కొనసాగుతోంది. ఉదయం 6 గంటల వరకు 1.820 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వకు గాను 1.107 టీఎంసీల నీరు ఉన్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 220 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 31 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో నష్టపోతున్నట్లు పేర్కొన్నారు.