హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రూ. 54 లక్షలతో లక్ష్మీదేవిగా దుర్గామాత అలంకరణ

RR: రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్ గూడ హైందవనగర్‌లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని ఏకంగా రూ. 54 లక్షల నూతన కరెన్సీ నోట్లతో లక్ష్మీదేవి అవతారంలో అలంకరించడం విశేషం. ఈ అద్భుతమైన అలంకరణను తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని చూసిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు.