హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షం పడితే గుంటలమయమే!

ముంచంగిపుట్టు మండలాల మధ్య కుజుభంగి నుంచి రూఢకోట వెళ్లే రహదారి వర్షం పడితే పూర్తిగా గుంటలు తేలి అధ్వానంగా మారింది. గోతుల్లో నీరు నిలవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. దీంతో ఆర్టీసీ అధికారులు పాడేరు-కొరవంగి బస్సును రద్దు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.