AKP: జిల్లాలో ఇవాళ ఉదయం 8:30 గంటల వరకు సగటున 10.2 మి.మీ వర్షపాతం రికార్డైంది. నర్సీపట్నంలో అత్యధికంగా 60.6 మి.మీ వర్షం కురవగా.. గొలుగొండలో 46.2, మాడుగులలో 43.0, రోలుగుంటలో 32.4 మి.మీ పడింది. మొత్తం 17 మండలాల్లో వర్షం పడగా, 7 మండలాల్లో పొడి వాతావరణం ఉందని రెవెన్యూ శాఖ తెలిపింది. కాగా అక్టోబరులో సాధారణం కంటే 72.8 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
వర్షపాతం నమోదు వివరాలు ఇవే!


