BDK: జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు PCPNDT చట్టాన్ని కచ్చితంగా పాటించాలని DMHO డాక్టర్ తుకారాం రాథోడ్ ఆదేశించారు. కొత్తగూడెంలో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సెంటర్ను 3 నెలలకోసారి తనిఖీ చేయాలని, రికార్డులు సక్రమంగా ఉంచాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షల నివారణకు నిఘా పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ DMHO నాగలక్ష్మి పాల్గొన్నారు.
తెలంగాణ
'లింగ నిర్ధారణ పరీక్షల నివారణకు నిఘా పెంచాలి'


