హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 21 నుంచి అమరవీరుల వారోత్సవాలు

అనంతపురం నగరంలో పోలీసు అమరవీరుల వారోత్సవాలు ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని ఎస్పీ జగదీష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 రోజుల పాటు ఈ వారోత్సవాలు నిర్వహించాలన్నారు. 23న భారీ ర్యాలీ, క్యాండిల్ లైట్ మార్చ్ ఉంటుందన్నారు.