హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ మహా సరస్వతీ దేవిగా అమ్మవారు

RR: షాద్‌నగర్‌లోని శ్రీ శివ మారుతీ గీతా అయ్యప్ప దేవాలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు అమ్మవారు శ్రీ మహా సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. జ్ఞానానికి, విద్యకు అధిదేవతయైన సరస్వతీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయం మారు మ్రోగింది.