హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 20 వరకు సౌదీకి విమానాలు రద్దు

హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లే విమాన సర్వీసులను ఈ నెల 20 వరకు రద్దు చేశారు. రియాద్, దమ్మామ్, జెడ్డా, మదీనా నగరాలపై డ్రోన్లు, క్షిపణి దాడుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌లైన్స్ ప్రకటించాయి. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాకే సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించాయి.