KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక పార్నపల్లి రోడ్డులో ఉన్న ఓ చికెన్ షాపుకు శుక్రవారం రాత్రి దుండగులు నిప్పు పెట్టారు. అలాగే చికెన్ షాప్ వద్ద ఉన్న రెండు వాహనాలను కూడా దహనం చేశారు. దీంతో దాదాపు రూ.5 లక్షల మేర నష్టం జరిగిందని వాపోతున్నారు. దుండగులను పట్టుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
చికెన్ షాపుకు నిప్పు పెట్టిన దుండుగులు


