హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉప్పులూరు రైల్వే గేట్ మూసివేత

కృష్ణా: కంకిపాడు-కేసరపల్లి మధ్య ఉప్పులూరు రైల్వే గేటు వద్ద రైలు పట్టాల మరమ్మతులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ పనుల కారణంగా శనివారం నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు గేటును మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.