GNTR: కన్నతల్లి మరణాన్ని తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాపట్ల(D) పెదపూడికి చెందిన మన్మోహన్ (32) చేబ్రోలులో జూనియర్ లైన్మెన్. అతడు గొడవర్రులోని అత్తగారింట్లో ఉంటున్నాడు. ఇటీవల తల్లి అనారోగ్యంతో కన్నుమూయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు గుంటూరు GGHకు తరలించగా మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
తల్లి మరణం తట్టుకోలేక లైన్మెన్ ఆత్మహత్య


