హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా నిత్య కల్యాణం

VKB: దసరా ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిత్య కల్యాణం, హోమ క్రతువులు జరిపించారు. సాయంత్రం స్వామివారి ఊరేగింపు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.