హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు'

BHPL: మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో నిర్వహించిన సమీక్షలో రోడ్లు, పైప్‌లైన్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై చర్చించారు. అంబేడ్కర్ సెంటర్‌ నుంచి కృష్ణ కాలనీ, ఓసీ-2 వరకు పనులకు అంచనాలు సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ పనుల్లో నిర్లక్ష్యం వద్దని సూచించారు.