హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డుపై ఇసుక.. రైతుకు గాయాలు

MBNR జడ్చర్లలోని కావేరమ్మపేట హైవే ఫ్లైఓవర్ పక్కన రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకతో ద్విచక్ర వాహనంపై వస్తున్న రైతు అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో రైతు ముఖానికి గాయాలై రక్తస్రావమైంది. మున్సిపల్ అధికారులు, హైవే అధికారులు వెంటనే స్పందించి ఇసుకను తొలగించి, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.