హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గిరిజనులు వినూత్న నిరసన

Akp: రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ నేరేడు బంధ గ్రామంలో పంటలు ఎండిపోవడంతో గిరిజన రైతులు ఇవాళ వినూత్నంగా నిరసన తెలిపారు. సాగు చేసిన సామలు, బొబ్బర్లు, మెట్టధాన్యం, మొక్కజొన్న పంటలు నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన పొలాల్లో నాగళ్లతో దుక్కి దున్నుతూ ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.