హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూళ్లూరుపేట మున్సిపల్ పోరు

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. టీడీపీ నుంచి పిట్ట సుహాసిని, వైఎస్సార్‌సీపీ నుంచి విమల కుమారి బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుతో స్థానికంగా రాజకీయ ఉత్కంఠ నెలకొంది. పీఠం దక్కించుకునేందుకు ఇరుపార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.