హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాకాంబరీ దేవి రూపంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పురపాలక పరిధిలో గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ విరుపాక్షి మారెమ్మ దేవి నవరాత్రి వేడుకలలో భాగంగా ఇవాళ శాకంబరి దేవి రూపంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత వివిధ రకాల కూరగాయలతో శాకాంబరీ దేవి రూపంలో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు.