హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండెపోటుతో రేషన్ డీలర్ మృతి

JN: స్టేషన్ ఘన్‌పూర్ మండల పరిధిలోని రాఘవపురం గ్రామంలో రేషన్ డీలర్ గంగారపు సురేందర్ గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. కరోనా కష్టకాలంలో ఆయన ప్రజలకు అందించిన నిరాటంక సేవలను గ్రామస్థులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వ్యవసాయం పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉంటూ, అందరితో ఆప్యాయంగా ఉన్నారు. సురేందర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.