హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా కళ్యాణ వెంకన్న గరుడోత్సవం

TPT: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడవాహన సేవ వైభవంగా నిర్వహించారు. జోరువానను సైతం లెక్కచేయకుండా భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు ఆరు గంటలపాటు సాగిన గరుడోత్సవంలో గోవింద నామస్మరణతో తుమ్మలగుంట మారుమోగింది. ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు పల్లకిపై ఊరేగారు.